ఉగాది పర్వదినాన సందర్భంగా పట్నం న్యూస్ డిజిటల్ మీడియా ఛానల్ ను పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు.
సీనియర్ రిపోర్టర్ పట్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతనంగా పట్నం న్యూస్ డిజిటల్ మీడియా ఛానల్ యొక్క వెబ్సైట్ ను యుట్యూబ్ ఛానల్ ను పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు
ఈ సందర్భంగా మందగిరి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రధాన మీడియా సంస్థలు కంటే డిజిటల్ మీడియా పట్ల ప్రజలు ఆదరణ చూపిస్తున్నారని పట్నం న్యూస్ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్నం న్యూస్ డిజిటల్ మీడియా ఛానల్ ఛైర్మన్ పట్నం శ్రీనివాస్ మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు